అఖిలాంధ్రుల ఆరాధ్య‌దైవం ఎన్టీఆర్ . బ‌స‌వ‌తార‌కంల పుణ్య‌దంప‌తుల‌కు తాను కుమారుడిగా జ‌న్మించ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని అన్నారు నంద‌మూరి బాల‌కృష్ణ . హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆసుప‌త్రిలో ఆయ‌న సోమ‌వారం త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఆసుప‌త్రి చైర్మ‌న్ కావ‌డంతో ఆయ‌న రోగులు మ‌ధ్య త‌న జ‌న్మ‌దినోత్స‌వాన్ని అంద‌రి ఆనందోత్సాహాల మ‌ధ్య వేడుక‌లా చేసుకున్నారు.

ముందుగా బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆసుప‌త్రి సిబ్బంది స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం ప‌లువురు ఆయ‌న పుష్ప‌గుచ్చాలు అందించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బ‌స‌వ‌తార‌కం కేన్స‌ర్ ఆసుప‌త్రి సీఈఓ డాక్ట‌ర్ ఆర్‌. వి. ప్ర‌భాక‌ర‌రావు, సీఓఓ జి.ర‌వికుమార్ , వైద్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here