మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపి మంత్రి నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో గెలుపు కోసం టిడిపి అడ్డదారులు తొక్కిందని మండిపడ్డారు. అయినా విజయం త‌మ పార్టీదేన‌న్నారు. గెలుపు కోసం లోకేష్‌ ఏకంగా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలే ఈ విషయం చెప్తున్నారని.. ఇది తానూ చెప్తున్న మాట కాదన్నారు ఆర్,కె. మంగళగిరి నియోజకవర్గంలో గ్రామాల్లో డబ్బులు కట్టలు కట్టలు పంచారని , నగదు రూపంలో కాకుండా ఏసిలు, రిఫ్రిజిరేటర్లు, టూవీలర్లు, టీవిలు, ఐఫోన్లు ఇష్టం వచ్చినట్లు పంచారని విమర్శించారు. కేవలం గెలుపు కోసం ఇంతగా దిగజారి అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. లోకేష్‌ ఖర్చు పెట్టిన రూ. 200 కోట్లు వృధా అని , వైఎస్‌ఆర్‌సిపిదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here