ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, జవహర్, నక్కా ఆనంద్ బాబు, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ విజ్ఞాపన పత్రాన్ని కూడా సీఈసీకి పంపారు. రాష్ట్రంలో రీపోలింగ్‌కు సిఫార్సు చేయాలని సీఎస్‌ను డిమాండ్ చేశారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్ కోసం గతంలోనే ఈసీఐని కోరినట్టు మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వైసిపి చేస్తున్న ఫిర్యాదులపై వెనువెంటనే స్పందిస్తున్న ఈసీ.. తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం బుట్టదాఖలు చేస్తోందని ఆరోపించారు.