యూపీఏ చైర్మ‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ విప‌క్ష నేత‌ల‌కు లేఖ‌లు రాశారు. ఈనెల 23వ తేదీన లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫలితాలు వెలుబ‌డ‌నున్న నేప‌థ్యంలో విప‌క్ష‌ పార్టీల నేత‌ల‌ను ఆమె ఆహ్వానిస్తున్నారు . డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌కు సోనియా లేఖ రాసిన‌ట్లు స‌మాచారం. జ‌న‌తాద‌ళ్, ఎన్సీపీ, ఎస్పీ-బీఎస్పీ కూట‌మి నేత‌ల‌కు కూడా సోనియా లేఖ‌లు రాశారు. వాస్త‌వానికి లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సోనియా పాల్గొన లేదు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీలు ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈనెల 23వ తేదీన జ‌ర‌గ‌నున్న ప్ర‌తిప‌క్షాల భేటీకి ప‌లువురు నేత‌లు హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ఏపీ సీఎం చంద్ర‌బాబు , శ‌ర‌ద్ ప‌వార్ హాజ‌రుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, వైఎస్ఆర్ పార్టీ నేత జ‌గ‌న్‌తోనూ కాంగ్రెస్ పార్టీ ట‌చ్‌లో ఉన్న‌ట్లు రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులామ్ న‌బీ ఆజాద్ స్ప‌ష్ట‌మైన సంకేతాన్ని ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here