కోల్‌క‌తాలో అమిత్ షా రోడ్డు షో స‌మ‌యంలో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో బెంగాలీ విద్యావేత్త ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హం ధ్వంస‌మైంది. అయితే విగ్ర‌హం ధ్వంసం అయిన చోటే మ‌రో భారీ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టాప‌న చేస్తాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వెల్ల‌డించారు. ఇవాళ యూపీలోని మావు ప‌ట్ట‌ణంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈశ్వ‌ర్ చంద్ర విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, విద్యాసాగ‌ర్ విజన్‌కు మేం క‌ట్టుబడి ఉన్నామ‌న్నారు ఆయ‌న. పంచ‌లోహాల‌తో త‌యారు చేసిన విద్యాసాగ‌ర్ భారీ విగ్ర‌హాన్ని అక్క‌డే ప్ర‌తిష్టిస్తామ‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here