ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు
చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు
శిక్షణా శిబిరం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , తదితరులు ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here