తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది పగటి కలే అని అన్నారు ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. ఆ ఫ్రంట్‌కు రంగు, రుచి, వాసన లేదని ఆయన విమర్శించారు. క‌డ‌ప జిల్లా వేంపల్లెలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపి సిఎం చంద్రబాబు ప్రధాని రేసులో లేనంటూ ముందు నుంచే స్పష్టం చేస్తున్నారని తెలిపారు. యూపీఏ కూటమిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 16న కడప జిల్లాలో పర్యటిస్తారని, ఆ రోజు కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని తులసిరెడ్డి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here