ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్న మహానీయుడు కాటన్‌ అని ఏపి సిఎం చంద్రబాబు కొనియాడారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.అనంత‌రం సిఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ .. కాటన్‌ నీటి విలువ, గొప్పదనం తెలిసిన గొప్ప వ్యక్తిగా అభివ‌ర్ణించారు. అందువల్ల ఆయన స్ఫూర్తితోనే నీరు-ప్రగతి వంటి జల సంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని వివ‌రించారు. ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా కాటన్‌ తీర్చిదిద్దారన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావది నదిపై ఆనకట్ట నిర్మించి కాటన్‌ చరితార్థుడయ్యాడని వెల్లడించారు. ఆయన స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 70 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు. జులై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందిస్తామని వెల్ల‌డించారు. పోలవరం పూర్తయితే ఏపీ దశ, దిశ మారిపోతుందన్నారు ఆయ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here