ఈనెల 23న జరిగే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి వచ్చే కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత ఫారంలో నమోదు చేసి అందజేయాలని లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ , పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెల్ల‌డింఆచ‌రు. ఉదయం 8గంటలకే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని… అందువల్ల ఏజెంట్లుగా వచ్చే ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయం లో కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here