ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 27న రీ వెరిఫికేషన్‌ ఫలితాలను విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫలితాలతో పాటు జవాబు పత్రాలను సైతం ఆన్‌లైన్‌లో పెట్టాలని బోర్డుకు స్పష్టంచేసింది. మరోవైపు, ఈ రోజు రాత్రికి రీవెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఇంటర్‌ బోర్డు హైకోర్టుకు తెలిపింది. సవరించిన మార్కుల మెమోలను గురువారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్ల‌డించింది. ఇంటర్‌ పరీక్ష ఫలితాలు ప్రాసెస్‌ చేసిన గ్లోబరీనా సంస్థకు ఈ సందర్భంగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ విచారణను జూన్ 6 కు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here