విద్వేష భావాలు పెంచడమే మోదీ రాజకీయం అన్నారు ఏపి సిఎం చంద్ర‌బాబు. విభజించి పాలించడమే బీజేపీ వ్యూహం అన్నారు ఆయ‌న‌. దేశ చరిత్రలోనే అత్యంత విఫల ప్రధానిగా నరేంద్ర మోదీ మిగిలారని విమర్శించారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మోదీ వైఫల్యాలను టైమ్ మేగజైన్ కథనం ఎత్తి చూపిందని వివ‌రించారు ఎపి సిఎం చంద్ర‌బాబు. తనకు కులం, మతం అనేది లేదని, విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడానన్నారు ఆయ‌న‌. కులం, మతం, ప్రాంతం పేరుతో దేశాన్ని విభజించిన చరిత్ర నరేంద్ర మోదీదే అని ఆయ‌న విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే తనకు తెలిసిన విద్య అని, పేదలకు సంక్షేమం అందించడపైనే తన దృష్టి ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here