ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వ సానుకూల గాలులు బలంగా వీస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌లోని రట్లాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుంటున్న ఓటర్లు, మహిళల నాడిని పట్టుకోవడంలో రాజకీయ పండితులు విఫలమయ్యారన్నారు. ప్రతి రోజూ కొత్త కథలు అల్లుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టార‌న్నారు. రాజకీయ పండితులని చెప్పుకుంటున్న వారు ఢిల్లీలో కూర్చుని మోదీ సర్కార్‌కు అనుకూలంగా ఎలాంటి గాలులు లేవని ప్రతిరోజూ కొత్త కథలు అల్లుతున్నార‌న్నారు ఆయ‌న‌. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు, మహిళలు నాకు మద్దతిస్తున్న విషయం వారికి తెలియద‌న్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తూ చట్టం తీసుకువచ్చినందుకు తల్లులు, సోదరీమణులంతా నాకు సపోర్ట్ చేస్తున్నార‌ని వివ‌రించారు మోదీ. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు తమ మొబైల్స్‌లోనే అందరి నాయకులను గమనిస్తున్నారని, ఎవరికి ఓటు వెయ్యాలో వారికి చెప్పాల్సిన పని లేదని, వారు అభివృద్ధికే ఓటు వేస్తారని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here