రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య సామరస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ
కమిటీకి సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంలో మధ్యంతర నివేదికను కమిటీ
ఇటీవల న్యాయస్థానానికి సమర్పించింది. అయితే సామరస్య, అందరికీ ఆమోదయోగ్యమైన
పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును
కోరింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం
అంగీకరించింది. అయోధ్య పరిష్కారం కోసం ఆగస్టు 15 వరకు గడువు కల్పించింది.
ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 30లోగా వాటిని కమిటీ
ముందుకు తీసుకొచ్చేందుకు అనుమతినిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here