ప్రార్థించే పెదవుల కన్నా..సేవచేసే చేతులు మిన్న అన్నారు బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ కేన్స‌ర్ హాస్ప‌ట‌ల్ ఛైర్మ‌న్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. నర్సింగ్ వ్యవస్థకు పురుడు పోసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ప్రపంచ నర్సుల దినోత్సవంని ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ఘ‌నంగా జ‌రిపారు. దీనికి ముఖ్య అతిధిగా హాజ‌రైన బాల‌కృష్ణ కేక్ క‌ట్ చేశారు.ఆత్మీయ పలకరింపుతో రోగులకు న‌ర్సులు అందించే నిస్వార్థ సేవలు ప్రశంసనీయ‌మ‌ని ఆయ‌న కొనియాడారు. అనారోగ్యంతో వచ్చేవారికి వారు దయతో, నిస్వార్థంతో చేసే సేవలు సగం రోగాన్ని తగ్గిస్తుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు అంద‌రినీ అల‌రించాయి. ఈ కార్య‌క్ర‌మంలో బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ కేన్స‌ర్ హాస్ప‌ట‌ల్ CEO డాక్ట‌ర్ ఆర్‌. వి. ప్ర‌భాక‌ర‌రావు , COO జి. ర‌వికుమార్‌, మెడిక‌ల్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ టి.ఎస్‌. రావు , మెడిక‌ల్ సూప‌రిండెంట్ డాక్ట‌ర్ క‌ల్ప‌నా ర‌ఘ‌నాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here