తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విపక్షాలన్నీ ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగాయి. వేదికపై కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈనేప‌ధ్యంలో నగేశ్‌, వీహెచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీహెచ్‌ చేయి చేసుకోవడంతో నగేశ్‌ ఆయన చొక్కా పట్టుకున్నారు. తోపులాటలో ఇ్దదరూ కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు కిందపడి పోయిన వీహెచ్‌ను పైకి లేపారు. ఇద్దరి మధ్య సయేధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అఖిలపక్షనేతలు.. వేదికపై ఉన్న నేతలంతా కిందికి దిగాలని, ఒక్కో పార్టీ నుంచి ఒక నాయకుడు మాత్రమే ఉండాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here