పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్‌ శాఖలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఆగష్టు చివరి, సెప్టెంబరు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని వీరు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా సర్పంచుల పదవులకు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇటీవల సమావేశమై ఆగస్టు, సెప్టెంబరు నెలలో ఎన్నికల నిర్వహించే అంశాల‌ను చ‌ర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here