ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కు ఈరోజు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే బృందాలుగా విడిపోయిన అధికారులు ఇంటితో పాటు ఆఫీసులలోని రికార్డులను పరిశీలిస్తున్నారు.మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షికి సినిమాకు దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.