ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టీడీపీ దొంగల ముఠా దగ్గర ఉందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీకి సంబంధించిన సమాచారం ఇవాళ టీడీపీ వద్ద ఉందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారాన్ని టీడీపీ, చంద్రబాబు కలిసి దొంగిలించారని మండిపడ్డారు. ఆ సమాచారం టీడీపీ వద్దే కాకుండా, ఆ పార్టీ దొంగల ముఠా వద్ద కూడా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇ-ప్రగతి పోర్టల్ ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. జె.సత్యనారాయణ 2016 లో ఆధార్ సంస్థ చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ఈ తంతు నిరాటంకంగా కొనసాగిందని ఆరోపించారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తన పార్టీ యాప్ లో పెట్టుకోవడం అందరూ గమనించాలని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here