విదేశీ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర హోమంత్రిత్వ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు రాహుల్ నుంచి వివరణ కోరింది. 15 రోజుల్లోగా కాంగ్రెస్ చీఫ్ సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడంటూ ఆయనపై కొన్నేళ్లుగా స్వామి ఆరోపణలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సరిగ్గా పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలోనే కేంద్రం ఆయనకు నోటీసులు జారీ చేయడం విశేషం. ఇటు రాహుల్ భారతీయతపై ఆమె సోదరి, యూపీ ఈస్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అండగా నిలిచారు . రాహుల్ భారతీయుడేనా అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్త‌డంపై ఆమె మండిపడ్డారు. తన సోదరుడిపై చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుస‌న్నారు. ఆయన ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడ‌న్నారుఆమె. రాహుల్ పై కట్టుకథలు అల్లుతున్నార‌న్న ప్రియాంక .. అదంతా నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here