శ్రీలంక‌లో ఇవాళ భ‌ద్ర‌తా ద‌ళాలు నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో 15 మంది మృతిచెందారు. ఆ మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఉగ్ర‌వాదులు దాడులు త‌ర్వాత‌.. లంక పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. అయితే గ‌త రాత్రి జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో 15 మంది చ‌నిపోయిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ముగ్గురు సుసైడ్ బాంబ‌ర్లు త‌మ‌ను తాము పేల్చుకున్నారు. మిగితా వారిని పోలీసులు షూట్ చేశారు . క‌ల్ముని ప‌ట్ట‌ణంలో ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు గుర్తించిన పోలీసులు అక్క‌డ‌కు వెళ్లారు. దాంతో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఫైరింగ్ జ‌రిగింది. గాలింపు చేసిన ప్రాంతం నుంచి ఐఎస్ జెండాతో పాటు యూనిఫామ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here