మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గంలో గంభీర్ ఇటీవల ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. దీంతో ఈసీ ఆదేశాలతో రిటర్నింగ్ అధికారి గంభీర్ పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌ధ్యంలో గౌతమ్ గంభీర్ పై కేసు నమోదయింది. ప్రస్తుతం గంభీర్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here