త‌న‌ది మ‌రీ వెనుక‌బ‌డిన కులం అని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని మోదీ. యూపీలోని క‌న్నౌజ్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. మాయావ‌తి, అఖిలేశ్ కూట‌మి చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు మోదీ. ఇటీవ‌ల మోదీది ఫేక్ ఓబీసీ స‌ర్టిఫికెట్ అని ఎస్పీ, బీఎస్పీ నేత‌లు ఆరోపించారు. దీనికి ఇవాళ మోదీ కౌంట‌ర్ ఇచ్చారు. తానెప్పుడూ త‌న‌ కులం గురించి మాట్లాడ‌లేద‌ని, కానీ మ‌హాకూట‌మి నేత‌లు మాత్రం కులం గురించి మాట్లాడే విధంగా రెచ్చ‌గొడుతున్నార‌న్నారు. తాను వెనుక‌బ‌డిన వ్య‌క్తిని కాన‌నీ… కానీ క‌టిక వెనుక‌బడిన కుటుంబంలో పుట్టిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. కుల రాజ‌కీయాల్లోకి త‌న‌ను లాగ‌వ‌ద్ద‌న్నారు. తాను కేవ‌లం ఓబీసీని మాత్ర‌మే కాదు అని, కానీ మోస్ట్ బ్యాక్‌వ‌ర్డ్ క్యాస్ట్‌లో పుట్టిన‌ట్లు వివ‌రించారు. జాతీయ ప‌తాకాన్ని ప్రేర‌ణ‌గా తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు మోదీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here