ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరపాలని టీఆర్‌ఎస్ డిసైడ్ అయింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేప‌ధ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ . పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు ఆయ‌న‌. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహించాల‌న్నారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here