స్థానిక పోరుకు సిద్దంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సీఎం చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో ఆయ‌న టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారం కోసం ప్రతిపక్షం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యం కోసం తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు సిఎం .
ఎవరు ఎంత దుష్ప‌ప్ర‌చారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదన్నారు ఆయ‌న‌. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదన్నారు చంద్రబాబు. ఇంటర్‌ పరీక్షలపై తెలంగాణ సీఎం సమీక్ష పెడితే ఎవరూ నోరు మెదపరన్నారు. ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడితే మాత్రం గోరంత‌లు కొండంత‌లు చేస్తార‌న్నారు ఆయ‌న‌. ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందన్నారు ఏపి సీఎం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here