తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, టీజెఎఫ్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల, పల్లా వెంకటరెడ్డి తదితరులంతా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పార్టీ ఫిరాయింపులు తదితర అంశాలపై కెసిఆర్ ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేశారు. దీనికి ముందు ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు సూర్యాపేట కలెక్టర్ కు ఉత్తమ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ … ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉండటమే టీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం విఫలమయ్యాయని, పది లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here