ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.
పిల్లల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును
ఇంటర్ బోర్డు అగమ్యగోచరంగా మార్చడం దారుణమని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలకు
పాల్పడటం బాధాకరమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీవితం చాలా విలువైనద‌న్న ఆయ‌న‌, నిరాశతో
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా
ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై
కఠినమైన చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ప‌వ‌న్
క‌ల్యాణ్ . విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలని అన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడిన తల్లిండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here