ఈవీఎంలలో లోపాలను సరిదిద్దడంలో ఎన్నికల క‌మీష‌న్ విఫలమవుతోందని ఆరోపించారు టిడిపి
అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమికి ఎన్నికల ప్రచారం కోసం ఆయ‌న
ముంబయి వెళ్లారు. ఈవీఎం లోపాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయ‌న
మాట్లాడారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు సుప్రీంకోర్టును
ఆశ్రయించినట్లు వివ‌రించారు. ఎవరికి ఓటు వేశామనేది వీవీప్యాట్‌లో 7 సెకన్లు కనపడాలని, అది
కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. వీవీప్యాట్‌ల కోసం 9 వేల కోట్లు ఖర్చు
పెట్టి ఏం చేశారని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో సీఈవో కూడా ఓటు
వేసేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here