కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎమ్మెల్యే హ్యండిచ్చారు. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నేప‌ధ్యంలో ఆ
పార్టీకి షాకిచ్చారు. త్వరలోనే తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
వెంకటరమణారెడ్డి వెల్ల‌డించారు. భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో
నిలిపేందుకే సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటు గండ్ర
సతీమణి, భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సైతం కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి
రాజీనామా చేశారు. తన భర్త టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. నైతికంగా
తాను కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని, అందుకే పార్టీకి, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా
చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి
పంపారు. గండ్ర కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించడంతో కాంగ్రెస్‌ జంపింగ్‌
ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here