ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హారం ముదిరి పాకాన ప‌డింది. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని
డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ధర్నాకు దిగారు. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం
ముందు ఆయన ఆందోళన చేశారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి బేగంబజార్‌కు తరలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున బోర్డుకార్యాలయం వద్దకు వస్తుండడంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణఇంటర్‌బోర్డు ఆఫీసు దగ్గర రెండోరోజు ఉద్రిత నెలకొంది. ఇంటర్‌ బోర్డు ఆఫీసు ముట్టడికి విద్యార్థిసంఘాలు యత్నించాయి. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో కొంత మంది రాజకీయ లబ్ధి కోసం సమస్యను వివాదాస్పదం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ పరీక్ష
ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారి
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ వ్యవహారంపై తాము నియమించిన కమిటీ
త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ, అప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ
ఇచ్చారు. హైదరాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు
మరోసారి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here