కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో పోటీకి సమర్పించిన ఎన్నికల
అఫిడవిట్‌కు రిటర్నింగ్ అధికారి గ్రీన్ సిగ్న‌ల్ తెలిపారు. రాహుల్ సమర్పించిన అఫిడవిట్,
అనుబంధ పత్రాలు సరిగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి వెల్ల‌డించారు. రాహుల్ నామినేషన్
పత్రాల్లో వివ‌రాలు స‌క్ర‌మంగా లేవంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్ లాల్ ఫిర్యాదు చేశారు. ఈ
నేపథ్యంలో రాహుల్ నామినేషన్ పత్రాల పరిశీలనను మిశ్రా రెండ్రోజులు వాయిదా వేశారు.
అయితే రాహుల్ గాంధీ నామినేషన్‌ను సవాలు చేసిన ఫిర్యాదిదారుడు ఎలాంటి సాక్ష్యాలను
సమర్పించలేదన్నారు. ఆయనపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోయారని రిటర్నింగ్
అధికారి రామ్‌మనోహర్ మిశ్రా స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు రాహుల్ నామినేషన్ పత్రాలపై
లేవనెత్తిన అభ్యంతరాలపై ఆయన తరఫు లాయర్ కేసీ కౌషిక్ రిటర్నింగ్ అధికారికి వివరణ
ఇచ్చారు. రాహుల్ ఇండియాలోనే పుట్టారని, ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారని, ఇతర దేశ
పౌరసత్వాన్ని రాహుల్ ఎప్పుడూ తీసుకోలేదని ఆయన తెలియజేశారు. ఆయన పాస్‌పార్ట్, ఓటర్
ఐడీ, ఆదాయం పన్ను, ప్రతీదీ ఇండియాకు చెందినదేనని వివ‌రించారు. రాహుల్ 1995లో
కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ చేశారని, ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కాపీని తాను
జతచేశానని కౌశిక్ వివరించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో రిటర్నింగ్ అధికారి సంతృప్తి
చెండ‌టంతో రాహుల్ అఫిడవిట్ చెల్లుతుందంటూ వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here