కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథిలో దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంపై
అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాహుల్‌ నామినేషన్‌ పత్రాల తనిఖీని ఆ నియోజకవర్గ
రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే, అమేథీలో సమర్పించిన
నామినేషన్ పట్ల ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్
సమర్పించిన నామినేషన్ పట్ల అనేక సందేహాలు ఉన్నాయంటూ ఆయన రిటర్నింగ్ అధికారికి
ఫిర్యాదు చేశారు. అయితే ధ్రువ్ లాల్ తరఫు న్యాయవాది రవిప్రకాశ్ దీనిపై వివరణ ఇచ్చారు.
ఎన్నికల అఫిడవిట్ లో రాహుల్ గాంధీ విద్యార్హతల విషయంలో తమకు అనుమానం వస్తోందని
తెలిపారు . డాక్యుమెంట్లలో ఆయన విద్యార్హతల విషయం సరిపోలడంలేదన్నారు. కాలేజీలో
ఆయన పేరు ‘రౌల్ విన్సీ అని ఉందన్నారు. రాహుల్ గాంధీ పేరిట ఒక్క సర్టిఫికెట్ కూడా లేదని
వివరించారు. అందుకే, రాహుల్ గాంధీ, రౌల్ విన్సీ ఒక్కరేనా అనేది తేల్చుకోవాలను
కుంటున్నామన్నారు రవిప్రకాశ్ . రాహుల్ గాంధీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తే త‌మ సందేహన్ని
తీర్చుకుంటామ‌న్నారు ఆయ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here