తన నానమ్మ ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తిని తాను కాదన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. త‌న‌ని ఆమెతో పోల్చ‌వ‌ద్ద‌న్నారు. ఆమె ముందు తాను ఓ నీటి బిందువులాంటిదాన్నని స్ప‌ష్టం చేశారు. అయితే సమాజం కోసం సేవ చేయాలనే ఆమెలోని అకుంఠిత స్వభావం తనలో, తన సోదరుడు రాహుల్ గాంధీలో ఉన్నాయని అన్నారు. ఈ స్వభావాన్ని తమ నుంచి ఎవరూ తీసివేయ లేరన్నారు ఆమె. ప్ర‌జ‌లు త‌మ‌కు మద్దతు పలికినా, పలకకపోయినా నిరంత‌రం ప్ర‌జా సేవలోనే ఉంటామని వివ‌రించారు ప్రియాంక‌. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మ‌రోవైపు బీజేపీపై ప్రియాంక ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశం కోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. కాన్పూర్ ను స్మార్ట్ సిటీ చేస్తామని బీజేపీ చెప్పిందని… కానీ, ఆ దిశగా ఇంతవరకు ఏమీ జరగలేదని అన్నారు. మోదీని ఒక అసమర్థ ప్రధానిగా అభివర్ణించారు ప్రియాంక .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here