తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఆయ‌న విడుదల చేశారు. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 27న ఫలితాలు విడుద‌లవుతాయి. ఈసారి ఎన్నికల దరఖాస్తులను ఆన్ లైన్లో స్వీకరించనున్నారు . తెలంగాణలో మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్తానాల‌కు ఎన్నికలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here