నిన్న‌నే త‌మిళ‌నాడులో పోలింగ్ ముగిసిన నేప‌ధ్యంలో సూప‌ర్ స్లార్ ర‌జ‌నీ కాంత్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. చెన్నైలోని తన నివాసం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ధీమా వ్య‌క్తం చేశారు ర‌జ‌నీ కాంత్‌. మే 23న వెలువడనున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు అధికార అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వస్తే .. తమిళనాడులో మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు అనివార్య‌మైతే పోటీ చేస్తారా ? అని మీడియా ప్ర‌తినిధులు ప్రశ్నించారు. ఇదే జ‌రిగితే తాము ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సిద్ధమేనంటూ రజనీకాంత్ కామెంట్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here