హనుమాన్ శోభాయాత్రతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకుంది. గౌలిగూడ రామాలయం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్లోని తాడ్బండ్ వరకు కొనసాగనుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్ బండ్ వరకు సుమారు 13 కిలోమీటర్లు శోభాయాత్ర సాగుతుంది. శోభాయత్ర కోసం 8 వేల మంది సిబ్బంది, 400 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘా పెట్టారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.