తిరుమలలో వసంతోత్సవాలు పురస్కరించుకుని శ్రీవారి స్వర్ణ రధోత్సవం కన్నుల పండువగా సాగింది. సర్వాలంకారా భూషితుడైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై తిరువిధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సర్వాలంకారా భూషితుడైన స్వామి వారిని బంగారు రథంపై కొలువు తీర్చుతారు. సూర్యోదయ కిరణ కాంతులు రథంపై పడుతుండగా.. వాహన సేవను చేసేందుకు భక్తుల వెయ్యి కళ్ళయిన చాలవు అన్నట్టుగా భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వాలాహక అనే నాలుగు గుర్రాలను పూన్చిన స్వర్ణరథంపై స్వామి వారు విహరిస్తారు . స్వర్ణరథం స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది . అందుకే ఏడాదిలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి తరువాత వసంతోత్సవాలలోనే మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు.