భానుడు హైద‌రాబాద్ నగరంపై నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నమోదవడంతోపాటు వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలుగురోజులుగా నగరంలో
సాధారణం కంటే 2- 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీలకు చేరడంతో రాత్రివేళల్లో
సైతం వేడిగాలుల తీవ్రత కన్పిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపం
చూపిస్తుండటంతో మధ్యాహ్న సమయంలో రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రధాన రహదారులపై వచ్చేందుకు వాహనదారులు
భయపడుతున్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు చేరే అవకాశం వుంది.
ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు కూడా వీచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఏప్రిల్‌, మే నెలలో సాధారణం కంటే 4-5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయ‌ని అదికారులు
చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here