దేశ‌వ్యాప్తంగా రెండో దశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు గురువారం నాడు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ
రెండో విడతలో 97 స్థానాలకు పోలింగ్ జర‌గ‌నుంది. మొత్తం దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో రెండో విడత
పోలింగ్ షురూ కానుంది. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడులో మొత్తం 54 స్థానాలకు పోలింగ్‌
జరుగుతుంది. ఉత్తరాదిన 11 రాష్ట్రాల్లో 43 స్థానాలకు పోలింగ్ కు ఎన్నిక‌ల అధికారులు అన్ని
ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ లో 8 స్థానాలుంటే ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, మధుర, హథ్రాన్‌,
బులంద్‌ సహర్‌, ఆమ్రోహా, నగీనా , అలీగఢ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఆ యా పోలింగ్‌
కేంద్రాలకు ఇప్ప‌టికే పోలింగ్ సామాగ్రితో స‌హా చేర‌కున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు
జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను
మోహ‌రించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రతను పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here