ఆంద్ర‌ప్ర‌దేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అశోక్‌బాబు ప్రమాణం చేశారు. ఆయన చేత మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. .రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. పార్టీ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సియం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నుంచి 60 ఏళ్ల తర్వాత తనకు అవకాశం వచ్చిందన్నారు ఆయ‌న‌. మళ్లీ సియంగా చంద్రబాబే వస్తారని ఆయన వ్యాఖ్యానించారు . సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అశోక్‌బాబు. ఈ కార్యక్రమానికి టిడిపి నేత‌లు కనకమేడల, బుద్ధప్రసాద్‌, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here