Home రివ్యూలు యన్.టి.ఆర్-కథానాయకుడు

యన్.టి.ఆర్-కథానాయకుడు

487
0
చిత్రం : ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’
నటీనటులు: నందమూరి బాలకృష్ణ – విద్యా బాలన్ – ప్రకాష్ రాజ్ – కళ్యాణ్ రామ్ – సుమంత్ – దగ్గుబాటి రాజా – రానా దగ్గుబాటి – నరేష్ – మురళీ శర్మ – కైకాల సత్యనారాయణ – సాయిమాధవ్ బుర్రా – బ్రహ్మానందం – నిత్య మీనన్ – రకుల్ ప్రీత్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కథా సహకారం: శ్రీనాథ్
నిర్మాతలు: నందమూరి వసుంధర – నందమూరి బాలకృష్ణ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: క్రిష్

సినీ.. రాజకీయ రంగాల్లో శిఖర స్థాయిని అందుకున్న నందమూరి తారక రామారావు జీవిత కథను వెండి తెరపై చూపించే ప్రయత్నం చేశాడు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండు భాగాల ‘యన్.టి.ఆర్’తో మొదటిదైన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ తారకం (విద్యా బాలన్) తనతో పెళ్లి తర్వాత రకరకాలుగా మలుపులు తిరిగిన భర్త జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. స్వాతంత్రం అనంతరం రిజిస్టరాఫీసులో ఉద్యోగంలో చేరి.. అక్కడ అవినీతిని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆపై సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎలా వెండి తెర ఇల వేల్పుగా ఎదగడం.. ఆపై రాజకీయాల వైపు అడుగులేయడం.. ఇలా ఆయన జీవితాన్ని తరచి చూపిస్తూ సాగే కథ ఇది.

కథనం – విశ్లేషణ:

క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ తారకం (విద్యా బాలన్) తనతో పెళ్లి తర్వాత రకరకాలుగా మలుపులు తిరిగిన భర్త జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. స్వాతంత్రం అనంతరం రిజిస్టరాఫీసులో ఉద్యోగంలో చేరి.. అక్కడ అవినీతిని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆపై సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ ఎలా వెండి తెర ఇల వేల్పుగా ఎదగడం.. ఆపై రాజకీయాల వైపు అడుగులేయడం.. ఇలా ఆయన జీవితాన్ని తరచి చూపిస్తూ సాగే కథ ఇది.

కథనం – విశ్లేషణ:

గత ఏడాది సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ బయోపిక్ లకు కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించింది. తర్వాత ఏ బయోపిక్ వచ్చినా కూడా దాంతో పోల్చి చూసే పరిస్థితి ఉందిప్పుడు. ఐతే అందరి కథల్లోనూ సావిత్రి జీవితంలో ఉన్నంత డ్రామా.. మలుపులు ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ కథనే తీసుకుంటే ఆయన సినీ జీవితంలో ఎత్తులే తప్ప పల్లాలనేవి కనిపించవు. ఆరంభంలో కొంచెం ఒడుదొడుకుల్ని మినహాయిస్తే ఆయన సినీ ప్రయాణమంతా సాఫీగా సాగిపోయిందే. ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతూ వెళ్లాడే తప్ప.. ఎన్టీఆర్ ఏనాడూ తన సినీ జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎదుగుదల ఎలా సాగిందన్నది అందరికీ తెలిసిన వ్యవహారమే. రాజకీయ రంగంలో అయినా ఎత్తుపల్లాలున్నాయి కానీ.. సినీ ప్రయాణంలో మాత్రం ఎన్టీఆర్ కు ఎదురన్నది లేదు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎలా చూపిస్తారనే విషయంలో అనేక సందేహాలున్నాయి. ఐతే అదంతా ‘యన్.టి.ఆర్-మహా నాయకుడు’కు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇప్పుడు చర్చ అనవసరం.

ఇక ఎన్టీఆర్ సినిమా కెరీర్ తో పాటు.. ఆయన రాజకీయాల వైపు అడుగులేసే వరకు చూపించిన చిత్రం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’. కథ పరంగా ఇందులో ఎగ్జైట్ చేసే అంశాలు చాలా తక్కువ. కాకపోతే క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడుండటం వల్ల తెలిసిన విషయాలే తెరపై కొంచెం అందంగా.. ప్రభావవంతంగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ ను ఇష్టపడేవాళ్లకు ఆయన కథను ఇలా చూసుకోవడం మహదానందం కలిగిస్తుంది. మిగతా సగటు ప్రేక్షకుల్ని కూడా ఓ మోస్తరుగానే ఎంగేజ్ చేస్తూ సాగుతుంది ‘యన్.టి.ఆర్’. పెద్దగా మలుపుల్లేని ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్ని.. నటీనటులు.. సాంకేతిక నిపుణుల అండతో క్రిష్ ప్రభావవంతంగానే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కథ పరంగా మాత్రం ఇందులో ఎగ్జైట్ అయ్యే అంశాలు పెద్దగా లేకపోవడం బలహీనత. ఇక ఎన్టీఆర్ పాత్రలో కనిపించడానికి నందమూరి బాలకృష్ణ పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది కానీ.. యంగ్ ఎన్టీఆర్ గా సగం సినిమా వరకు ఆ పాత్రలో చాలా ఎబ్బెట్టుగా కనిపించి తెగ ఇబ్బంది పెట్టేశాడు. కానీ వయసు మళ్లిన ఎన్టీఆర్ గా మాత్రం బాలయ్య అభినయం మెప్పిస్తుంది. ముఖ్యంగా సినిమాలతో సంబంధం లేకుండా మామూలుగా కనిపించే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్.. నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here