• 3-2తో ముంబాపై గెలుపు
  • ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం
కొచ్చి: ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్‌ థ్రిల్లింగ్‌ విజయంతో హ్యాట్రిక్‌ పరాజయాలకు బ్రేక్‌ వేసింది. మంగళవారం ఐదు సెట్లపాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 3-2 (13- 15, 15-11, 7-15, 15-14, 15-11)తో యు ముంబా వాలీపై గెలిచింది. ఈ విజయంతో ప్లే ఆఫ్‌ అవకాశాలను హైదరాబాద్‌ సజీవంగా ఉంచుకోగలిగింది. తొలిసెట్‌ ఆరంభంలో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. కానీ 6-6తో స్కోరు సమమైన దశలో ముందంజ వేసిన ముంబా అదే జోరులో 15-13తో ఆ సెట్‌ను నెగ్గింది. రెండో సెట్‌లో ఆధిక్యం చేతులు మారుతూ 7-7తో మరోసారి సమమైంది. అయితే, ప్రిన్స్‌ స్పైక్‌, రెయి జన్‌ బ్లాక్‌తో బ్లాక్‌ హాక్స్‌ 13-11తో ఆ సెట్‌ను నెగ్గి 1-1తో సమం చేసింది. ఆ తర్వాత ముంబా దూకుడు ప్రదర్శించి 15-7తో మూడో సెట్‌ నెగ్గింది. ఉత్కంఠభరితంగా సాగిన నాలుగోసెట్‌ను బ్లాక్స్‌ హాక్స్‌ 15-14తో గెలిచి మ్యాచ్‌ ఫలితాన్ని ఆఖరి సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక సెట్‌లో ఒక దశ వరకు ముంబా గట్టిగా ప్రయత్నించినా హైదరాబాద్‌ ఆధిక్యం నిలబెట్టుకుంది. దీంతో 15-11తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ నెగ్గింది. బ్లాక్‌ హాక్స్‌ ప్లేయర్‌ రోహిత్‌ కుమార్‌ 10 పాయింట్లు సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here