ముంబై: ఈ తరం క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర అన్నాడు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తన మాజీ సహచర ఆటగాడు మహేల జయవర్ధనెతో కలిసి సంగక్కర పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సంగక్కర మాట్లాడుతూ.. ‘ఈ తరం ఆటగాళ్లలో అందరికంటే విరాట్‌ ముందున్నాడు. ఒకటని కాకుండా.. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రతి పర్యటనలోనూ అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో కచ్చితత్వాన్ని చూపెడుతున్న అతను.. పరుగులు రాబట్టడంలో రాటుదేలిపోయాడు. భవిష్యత్‌లోనూ ఇదేస్థాయిలో ఆడతాడు’ అని సంగా ప్రశంసించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here