సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరిదైన మూడో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్‌ ఓటమి అంచున నిలిచింది. నాలుగో రోజు ఆట కడపటి సమాచారం అందేసరికి విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 6 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఇంకా 368 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్‌లో రోస్టన్‌ చేజ్‌ (47), రోచ్‌ (3) ఉన్నారు. జేమ్స్‌ ఆండర్సన్‌ (3/22) మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 277, విండీస్‌ 154 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ 361 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here