తెలుగులో ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్’ తదితర చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి సమీరారెడ్డి మరోమారు తల్లి కాబోతోంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరారెడ్డి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో కూడిన ఫొటోను షేర్‌చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఈ ఫొటోతో పాటు సమీరా ‘నిన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను బేబీ’ అనే కామెంట్ రాశారు. ఈ ఫొటోలో సమీరా గ్రే కలర్ అవుట్‌ఫిట్ ధరించారు. తల్లిని కాబోతున్నానన్న ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తోంది. హీరో సల్మాన్ సోదరుడు సోహెల్ ఖాన్‌తో ‘మైనే దిల్ తుఝ్ కో దియా’ సినిమాతో సమీరా బాలీవుడ్‌లో కాలుమోపారు. 2014లో సమీరా… అక్షయ్ వాద్రాను వివాహం చేసుకున్నారు. 2015 ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019లో జూలైలో తాను బిడ్డను కనబోతున్నానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here