ఆకుపూజ చేసి రెడీగా ఉండమంటున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మీ కన్నీళ్లకు నేను బాధ్యుడిని కానంటూ ట్విటర్ సాక్షిగా ప్రకటించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే సందర్భంగా వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కన్నీరు తెప్పిస్తుందని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తన సినిమా ప్రచారానికి ఆది నుంచి సోషల్ మీడియాను బాగా వాడేస్తున్న వర్మ.. ప్రస్తుతం తన సినిమా టీజర్ రేపు విడుదలవుతుందని చెప్పేందుకు కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్లకి దగ్గరలో ఉన్న గుళ్లలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటల కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’’ అని వర్మ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here