న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ ధోనీ మరో రికార్డుకి చేరువయ్యాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వికెట్‌కీపర్ల జాబితాలో మహీ (594) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ మరో మూడు మ్యాచ్‌లు ఆడితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌కీపర్‌ మార్క్‌ బౌచర్‌ (596)ను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటాడు. ధోనీ తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర (499), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (485) ఉన్నారు. ఇక, భారత్‌ నుంచి అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో ధోనీ (335) మూడో స్థానంలో ఉండగా బ్యాటింగ్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌ (463), రాహుల్‌ ద్రవిడ్‌ (340) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here