న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ యువ క్రీడాకారులు బహ్రెయిన్‌ జూనియర్‌, క్యాడెట్‌ ఓపెన్‌లో పతకాల పంట పండించారు. బహ్రెయిన్‌లోని మనామాలో మంగళవారం జరిగిన పోటీల్లో వివిధ విభాగాల్లో కలిపి భారత ప్యాడ్లర్లు ఏకంగా 8 పతకాలు సాధించారు. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక, క్యాడెట్‌ బాలికల సింగిల్స్‌లో అనర్ఘ్య మంజునాథ్‌, యశస్విని గోర్పడే ఫైనల్లో అమీతుమీకి సిద్ధమై భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here