• టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతి?
  • 15న ఆసీస్‌తో సిరీస్‌కు టీమిండియా ఎంపిక
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు భారత్‌ పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, టీ20 సిరీస్‌కు మాత్రం రోహిత్‌ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి నిస్తారని భావిస్తున్నారు. ఆసీస్‌తో తలపడే భారత జట్టును జాతీయ సెలెక్షన్‌ కమిటీ శుక్రవారం ఎంపిక చేయనుంది. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్‌లో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఆసీ్‌సతో తలపడే జట్టునే యథాతథంగా వరల్డ్‌క్‌పకు ఎంపిక చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ రేస్‌లో ఉన్న ఆటగాళ్లను పరీక్షించేందుకు 15 మందికి బదులు 16 మందిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. విరాట్‌ మళ్లీ జట్టులోకి రానుండడంతో.. టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతి నిచ్చే అవకాశాలున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రెండో వికెట్‌ కీపర్‌గా దినేష్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌ మధ్య గట్టిపోటీ నెలకొందన్నారు. తొలి మూడు వన్డేల్లో ఎటువంటి ప్రయోగాలకు ఆస్కారం లేదని.. కానీ చివరి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ను పరీక్షించడం కోసం శిఖర్‌ ధవన్‌ను పక్కనబెట్టే ఆలోచన ఉందని ఆ అధికారి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here