అక్కినేని నాగార్జున సినిమాలో ఆయన భార్య అమల అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ హీరోగా ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతున్న విసయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
నాగార్జునతో వివాహం తరువాత సినిమాలకు దూరమైన అమల.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో తల్లి పాత్రలో మెప్పించారు. ఆ తరువాత ‘మనం’లో కూడా అతిథి పాత్రలో నటించారు. తాజాగా ‘మన్మథుడు’ సీక్వెల్‌లో కూడా అతిథి పాత్రలో నటించబోతోందంటూ బలంగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ మాటల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here