న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఖండించాడు. కారు ప్రమాదంలో రైనాకు తీవ్ర గాయాలయ్యాయని కొందరు.. ఆ ఘటనలో చనిపోయాడని మరికొందరు సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించారు. వీటిపై రైనా ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. తనకేం కాలేదనీ, హాయిగా ఉన్నానని స్పష్టం చేశాడు. ‘నేను కారు ప్రమాదంలో గాయపడ్డాననీ కొన్నిరోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆ పుకారుతో మా కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దయచేసి ఇలాంటివి నమ్మొద్దు. నేను క్షేమంగా ఉన్నా. తప్పుడు వార్తలు సృష్టించిన వారిని గుర్తించాం. వారిపై చర్యలు తీసుకుంటాం’ అని రైనా ట్వీట్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here